సచిత్ర శ్రీరాజా తూము లక్ష్మీనృసింహదాసు

*** జై శ్రీరామ్ ***

"సచిత్ర శ్రీ రాజా తూము లక్ష్మీనరసింహదాసు" పుస్తక రచయిత శ్రీ ఎస్.టి. జి. అంతర్వేది కృష్ణమాచార్యులు గారు. వీరు భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆస్థాన సంస్కృత పండితులు ఆయన శ్రీ ఎస్ టి జి శ్రీమన్నారాయణ చార్యుల వారి ప్రథమ కుమారుడు. వీరికి బాల్యం నుండే సంస్కృత విద్య పట్ల మక్కువ ఎక్కువ అంతేకాదు సాహిత్యము రచనల పట్ల ఆసక్తిని కలిగి ఉండేవారు. వీరు సంస్కృత సాహిత్యంలో మరియు అంతేకాదు M.B.A ఫైనాన్సు కూడా చేసి భద్రాచలంలో ప్రైవేట్ కళాశాలలలో సంస్కృతం, తెలుగు, ఎకనామిక్స్ ,అకౌంట్స అతిధిఅధ్యాపకులుగా కూడా పని చేశారు. ఇప్పటివరకు వీరు వేద ,శాస్త్ర, పురాణ, ఆధ్యాత్మిక సాంస్కృతిక సాహిత్య విషయాలకు సంబంధించిన 81 పుస్తకాలు రచన చేశారు.. ఆధ్యాత్మిక విషయాల గురించి, భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రభావము వైభవము గురించి వార్తా చానల్లో భక్తి ఛానల్ లో ఎన్నో ప్రవచనాలు ఇచ్చారు. కృష్ణమాచార్య గారు మునుముందు ఎన్నో విశేషమైన రచనలు చేయాలని, సాహిత్య ప్రపంచంలో ధ్రువతారగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.