రాజా శ్రీ తూము నరసింహ దాసు వారి ప్రస్థానం


********* జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ *********
కృతయుగంలో ధ్యానము వలన త్రేతా యుగములో యజ్ఞములు చేయుట వలన ద్వాపరమున పరిచర్యల వలన ఎటువంటి ఫలితం లభించును అట్టి ఫలితము ఈ కలియుగమున హరినామ సంకీర్తనము వల్లనే లభించును.
మన కథానాయకుడైన శ్రీ తూము నరసింహదాసు గారు గోల్కొండ వ్యాపారి బ్రాహ్మణుడు. పూర్వము 6000 గోల్కొండ చేరి వ్యాపారము చేసేవారు ప్రభుత్వములో గొప్ప గొప్ప పదవులను సంపాదించిన కారణంచేత , వీరి శాఖ గోల్కొండ వ్యాపారులని పేరు వచ్చిందని అంటారు. దాసు గారి పూర్వీకులు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నివాసస్థులు. వీరి తండ్రి గారి పేరు అప్పయ్య, తల్లి వేంకమాంబ. వీరు ఆపస్తంభ సూత్రులు, పరాశల గోత్రోద్భవులు, వశిష్ట శక్తి పరాశర త్రయ ఋషులు. నరసింహ దాసు వారు 1790 సౌమ్య నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత రుతు మార్గశిర మాసం, శుద్ధ పంచమి శ్రవణా నక్షత్ర ద్వితీయ పాదం, కుంభ లగ్నము నందు 10.12.1790 పగలు12.00 గం.లకు జన్మించారు.
శ్రీ అప్పయ్య గారు సంగీత సాహిత్యంలో ఆరితేరిన వారు. జాతక కర్మ మహోత్సవం జరిపించి "నరసింహ దాసు"అని పేరు పెట్టారు. ఐదవ ఏటనే విద్యాభ్యాసము, 8వ ఏటనే ఉపనయనము చేసారు. వీరు చిరుప్రాయంలోనే అఖండమైన పాండిత్యం సంపాదించారు. మధురమైన కీర్తనల తో శ్రీరాముని కీర్తించేవారు. 1809 మా సంవత్సరాలు లో మంచి సంప్రదాయ కుటుంబం లో పుట్టిన సద్గుణరాశి అయినా లక్ష్మీబాయమ్మ గారిని వివాహం చేసుకున్నారు.
దాసు గారి 20వ సంవత్సరం లో వారి తండ్రి స్వర్గస్తుడగుటతో వీరి మీద పడినది. అప్పుడు గుంటూరు లో ప్రభుత్వ ఉద్యోగము కొంతకాలము చేసిరి. అపరరామ భక్తుడైన దాసు గారికి ఉద్యోగము ప్రతిబంధకంగా మారింది ,ఆ ఉద్యోగమునుండి విరమణ తీసుకొని తన తన ఇంటిలోని పట్టాభి రామమూర్తికి తిరువారాధనలు చేసేవారు. ఎక్కువ సమయం సంకీర్తనములతోనే గడిపేవారు. "భజన చేసే విధము తెలుపండి"-అనే కీర్తనతో భక్తి మార్గంను బోధించేవారు.
కొంతకాలము భద్రాద్రి యందు గడిపి తరువాత దేశ నలుగురు దేశ నలుమూలలా ఉన్న పుణ్యతీర్ధములను సేవించ తలచి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని"సెలవా మాకిక రామయ్య" "పోయి వత్తునటవే ఓ జననీ పోయి వత్తు నటవే"అంటూ అంటూ స్వామి వారి వద్ద సెలవు తీసుకుని తిరిగి ప్రయాణమయ్యెను.
1819 సంవత్సరములు శ్రీరంగ రంగనాథుని సేవించి 1820 సంవత్సరములు శ్రీకూర్మం పూరి జగన్నాథ క్షేత్రములను దర్శించి కాశీలో వితృతర్పణములు కావించి పవిత్ర త్రివేణి సంగమమున గుంపులిడి పిదప విక్రమ నామ సంవత్సర భాద్రపద మాసమునకు గుంటూరు చేరి తాను తీసుకొని వచ్చిన జలములతో మాతృదేవతను అభిషేకించారు.
1821 వృషణామ సంవత్సరంలో దక్షిణ దేశ యాత్రలో చేయడానికి గుంటూరు నుండి బయలుదేరి పొన్నూరు భావనారాయణ స్వామివారిని సేవించి ఉత్తర పినాకిని తీరమునందుగల నెల్లూరు రంగనాథ స్వామిని పూజించి ఉభయ కావేరి మధ్యలో ఉన్న శ్రీ రంగనాథుని సేవించి అక్కడి నుండి శ్రీరంగం కు వెళ్లారు" కావేటి రంగా కావవే రా"అనియు వందనమిదే శ్రీరంగా నీకు అంటూ రంగనాథ స్వామి కీర్తిస్తూ అక్కడి అక్కడి ఆలయంలోని ధ్వజస్తంభము బలిపీఠము రధము గజ తురగ శాలలు మరియు భాగవతోత్రములను దర్శించి, త్యాగయ్య గారికి ప్రణమిల్లి "రామభక్తి కీ త్యాగ యార్య వరుని సమముగా నేరరెవ్వ రీక్షా తలమున"అంటూ మధురంగా గానము చేశారు. తదుపరి రామేశ్వరం రామసేతు గర్భసైనములు చూసే తిరిగి శ్రీరంగము నుండి కంచి చూసుకొని అక్కడి నుండి తిరుమలకు చేరారు.
ఒకనాడు తూము లక్ష్మీ నరసింహ దాసు గారి స్వప్నంలో శ్రీరాముడు సీతతో లక్ష్మణునితో సాక్షాత్కరించి నీవు మన్నిల్లయమైనా భద్రాచలమునకు వచ్చిన నీ కోరిక సిద్ధించునని ఆనతినిచ్చి నిజాం ప్రభుత్వంలో అప్పటి ప్రధానమంత్రి గారైన శ్రీ చందూలాల్ గారిని కలవమ"ని ఆదేశించి అంతర్ధానమయ్యారు. అదేవిధంగా స్వామివారు నా భక్తుడు మీ దగ్గరకు వస్తాడని ఆయన్ని ఉచిత విద్యా సత్రించి నీ దగ్గర ఉంచుకో వలసిందిగా శ్రీ చందులాల్ గారికి కూడా స్వప్నంలో ఆదేశించారు.
అనంతరం శ్రీ తూము లక్ష్మీనరసింహదాసు గారు శ్రీ సీతారామచంద్రమూర్తి ఆదేశానుసారంగా ఒకనాడు హైదరాబాదు వెళ్లి శ్రీ చందూలాల్ గారిని కలిశారు. ఆయన శ్రీ తూము లక్ష్మీనరసింహదాసు గారిని తమ ఆస్థానంలోనే ఉంచుకొని శ్రీరాముని కీర్తనలను వినిపించమని కోరేవారు. అలా కొంతకాలం వారి ఆస్థానంలోనే శ్రీరాముని పై కీర్తనలు వ్రాసి వినిపిస్తూ ఉండేవారు. ఆ కీర్తనలు వింటూ ఎంతో భక్తి భావంతో మైమరచిపోయేవారు.
కొంతకాలం తర్వాత రామాజ్ఞ చేత శ్రీ చందూలాల్ గారు ఉచిత రీత్యా సత్కరించి శ్రీ రాజా అనే బిరుదులు ఇచ్చి శ్రీ తూములక్ష్మీనరసింహదాసు గారిని పాల్వంచ పరగణ కు తహసిల్దారుగా నియమించారు అంతేకాక భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి సర్వాధికారిగా1832 ' వసంవత్సరము నియమించారు. అప్పటినుండి ఆయన శ్రీ రాజా దూరము లక్ష్మీనరసింహదాసు గారుగా వాగ్గేయకారులుగా ప్రఖ్యాతి గడిoచారు. ఆయన కీర్తనలతో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రతిరోజు జరిగే దశవిధ ఉత్సవాలు నిర్వహించేవారు. మేలుకొలుపు దగ్గర నుంచి పవళింపు సేవ వరకు దశవిధ ఉత్సవాలు నిర్వహించుటయే కాక ఈ ఉత్సవ కార్యక్రమాలను బద్రుని గుడివెనుక స్థాపించబడిన రెండు స్తంభాలపై చెక్కించి దానిపై ప్రభుత్వం ఒక హుకుం జారీ చేసింది రామలక్ష్మణ స్తంభాలుగా నేటికీ భద్రాచల రామాలయంలో ఉన్నాయి అప్పటినుంచి నేటి వరకు భద్రాచల క్షేత్రంలో అర్చక స్వాములవార్లు శ్రీ రాజా దూరము లక్ష్మీనరసింహదాసు గారి కీర్తనలతో దశవిధ ఉత్సవాలు యధావిధిగా నిర్వహిస్తున్నారు.
అంతేకాక ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ ఉత్సవాలలో ప్రజలు అందరూ పాల్గొనాలని ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా శ్రీ రాజాతుము లక్ష్మీనరసింహదాసు గారు తిరు కళ్యాణం ఆరుబయట చేశారు ప్రజలు తిలకించేటట్లు ఇప్పటివరకు ఆ సాంప్రదాయం అలాగే కొనసాగుతుంది.
శ్రీ రాజా తూము లక్ష్మీనరసింహదాసు గారు నిర్వహించిన దశవిధ ఉత్సవంలు ఆయన కీర్తనలతో భద్రాచలంలో ఇప్పటికీ అద్భుతంగా జరుగుతున్నాయి.
1834 సంవత్సరములు శ్రీ రాజా తూము లక్ష్మీనరసింహదాసు గారి స్నేహితుడైన శ్రీ వరదరామదాసు గారు అశ్వస్థకు గురై పరమపదించడంతో ఆయన మనసు కలత చెంది కాళ్ళకు గజ్జలు కట్టుకొని తంబురా మీటుచూ వరదరామదాసు వారి శవం భుజంపై వేసుకుని భక్తులతో పాటు శ్రీరామ భజన చేసుకుంటూ గోదావరి నదిలో పడవపై వెళ్లి నడి గోదావరిలో దాసుగారు వరదరామదాసు గారి శవంతోపాటు ఆయనకూడా ప్రాణత్యాగం చేశారు. అట్టి స్నేహంవారిరువురిది. వారితోపాటు కొంతమంది భక్తులు ప్రాణత్యాగం చేసిన, వరదరామదాసు గారి మరియు శ్రీ రాజా తూము లక్ష్మీనరసింహదాసు గారి దేహాలు మాత్రం కనిపించలేదు.
Follow us on
Donation
(+91) 9848341505
15-1-53/2, S.R.N.Colony , Near H.P. Godown, Bhadrachalam , Bhadradri Kothagudem District, Telangana State India - 507111
info@tumunarasimhadasu.org


Website designed by Raghurama Kishan Tumu & developed by Padmaja Tumu






SBI Bhadrachalam
Account No. : 43548474435
IFSC Code : SBIN0020163